శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు . ఈ అమ్మవారు సిద్దిపేట పట్టణ ప్రాంతంలో కొలువైఉన్నది . శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి చుట్టుపక్కల నుండి అదేవిధంగా దూరప్రాంతాలనుండి చాలా మంది భక్తులు ఉన్నారు . ప్రతి సంవత్సరం ౩ రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా దసరా నవరాత్రులపుడు 9 రోజుల పాటు పూజలు జరుగుతాయి. శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి శ్రావణ మాసంలోను పూజలు జరుగుతాయి .
శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారిని శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు ప్రతిష్టించారు . అయ్యగారు 1917 పాతకోడురు నెల్లూరు జిల్లలో జన్మించారు . శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు ఆయుర్వేదం , ఆస్ట్రాలజీలో , సంస్కృతంలోను ,వ్యాకరణంలో , తెలుగులో ఇంకా చాలా వాటిలో నైపుణ్యం కలిగిఉన్నారు . శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు శ్రీ చాముండేశ్వరి సేవ సమితి శాక్తిమండాల్ని 1968 స్తాపించారు . అయ్యగారు జనవరి 31, 1988 లో అమ్మవారిలో ఐక్యమయినాడు . అయ్యగారి తరువాత శ్రీ చాముండేశ్వరి సేవ సమితి శాక్తిమండాల్ని అతని తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చూసుకుంటున్నాడు .
No comments:
Post a Comment